హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలి: సీఐటీయూ

సత్యసాయి: కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులకు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్మికులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకుని సంఘటితంగా పోరాడాలని నాయకులు సూచించారు.