హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికల్ షాప్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం

ASR: గోదావరిలో గల్లంతైన మెడికల్ షాప్ నిర్వాహకుడి మృతదేహం ఎటపాక మండలం గొల్లగూడెం నది ఒడ్డున మంగళవారం లభ్యమైంది. తూము రమేష్ సోమవారం కుక్కునూరు మండలం రాయిగూడెం శివాలయం సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు, అధికారులు చేపట్టిన గాలింపు చర్యల అనంతరం మంగళవారం ఆయన మృతదేహం లభ్యమైంది.