హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై పోలీసుల అవగాహన

ASR: జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బీ.వేణుగోపాల్ ఆధ్వర్యంలో సురక్ష ప్రోగ్రాం నిర్వహించారు. సీఐ బీ.సుధాకర్, ఎస్సై ఎండీ యాసిన్‌తో కలిసి మహిళలు, విద్యార్థులకు మహిళలపై నేరాల నివారణ, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నారు. వేధింపులు, అసభ్య ప్రవర్తనపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు.