VZM: గజపతినగరంలోని శ్రీరామక్షేత్ర జంక్షన్‌లోని కల్యాణ వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం, ఏకాదశి సందర్భంగా స్వామివారు భక్తులకు నిజరూపదర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం


