హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరవాడలో 61.6 మి.మీ వర్షపాతం

AKP: జిల్లాలో మంగళవారం ఉదయం 11 గంటల వరకు సగటున 17.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పరవాడలో 61.6 మి.మీ, అనకాపల్లిలో 49.2 మి.మీ, కోటవురట్లలో 44.4 మి.మీ వర్షం కురిసింది. దేవరాపల్లి, మునగపాక మండలాల్లో 37.2 మి.మీ చొప్పున వర్షపాతం రికార్డైంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.