హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే

BHPL: కేటీకే–8 ఇంక్లైన్‌లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతానన్నారు. కార్మికులకు రూ.25 లక్షల వైద్య భద్రత, 250 గజాల ఇంటి స్థలం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వం అండగా ఉందని వెల్లడించారు.