AKP: తుఫాను ప్రభావంతో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసర సేవలు, తాగునీరు సిద్ధంగా ఉంచాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసి, కలెక్టరేట్(8924222888)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలు


