హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MLAను కలిసిన నూతన PACS పాలకవర్గం'

WGL: వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన ఛైర్మన్ అబిడి రాజిరెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నాగరాజును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. PACS ఛైర్మన్ ఎన్నిక, పాలకవర్గ ఏర్పాటుకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పాలక వర్గ సభ్యులు వెల్లడించారు.