BDK: దుమ్ముగూడెం (M) పర్ణశాల గోదావరి స్నానాలకు వచ్చే మహిళా భక్తులకు పర్ణశాలలో దుస్తులు మార్చుకునే సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్‌లు నిర్వహణ లేక వినియోగానికి అనుకూలంగా లేవని భక్తులు చెబుతున్నారు. వాటిని మరమ్మతు చేసి పరిశుభ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తేవడంతో పాటు అవసరమైతే గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
'పర్ణశాలలో డ్రెస్సింగ్ రూమ్‌ల కొరత'


