హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి: ఎస్సై

JN: రఘునాథపల్లి మండలం కంచనపల్లి, శివాజీనగర్, మల్లంపల్లి గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మూడు గ్రామాల గణేష్ విగ్రహాలను పుట్టలమ్మకుంట చెరువు వద్ద నిమజ్జనం చేయాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించారు. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.