హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నను దర్శించుకున్న ఏపీ మహిళా కమిషన్

VSP: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ దంపతులు మంగళవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ పర్యవేక్షణాధికారి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు చైర్‌పర్సన్ దంపతులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందించారు.