హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు బోల్తా

అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వాల్మీకిపురం సమీపంలో అదుపు తప్పిన బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.