హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి కోసం ప్రశ్నిస్తే అరెస్టా?: గోపాలకృష్ణ

GDWL: జూరాల నుంచి వ్యవసాయానికి సాగునీరు విడుదల చేయాలని కోరినందుకు అరెస్టు చేస్తారా అని బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పోలీసులను ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జూరాల పర్యటన నేపథ్యంలో పోలీసులు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచడం సరికాదన్నారు.