హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలికలకు HPV టీకాపై అవగాహన'

KMM: బాలికల్లో భవిష్యత్‌ ఆరోగ్య సమస్యల నివారణలో HPV వ్యాక్సిన్‌ ప్రాధాన్యంపై UPHC వైద్యాధికారి దేవిశ్రీ అవగాహన కల్పించారు. ఖమ్మంలోని ఓ పాఠశాలలో 14 ఏళ్లు నిండిన 22 మంది బాలికలకు HPV టీకాలు వేశారు. టీకాపై అనవసర భయాలు, అపోహలు వీడి అర్హులైన పిల్లలకు టీకా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం పరిశుభ్రత, పాముకాటు, రేబిస్‌పై కూడా అవగాహన కల్పించారు.