హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ప్రారంభం

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. నేర స్థలంలోనే వేలిముద్రలు, డీఎన్ఏ వంటి ఆధారాలను శాస్త్రీయంగా సేకరించడానికి ఈ వాహనం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ యూనిట్ హత్య, దోపిడీ, అత్యాచారం వంటి కీలక కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తుందన్నారు.