హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్వానంగా VKB-HYD ప్రధాన రహదారి

VKB: HYD- వికారాబాద్ ప్రధాన రహదారిలో ఎన్నెపల్లి వద్ద గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గత కొంతకాలంగా తరచూ నీరు నిలుస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రహదారి అధ్వానంగా మారినా R&B అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలన్నారు.