WGL: ఖానాపురం మండలం రంగాపూర్‌లో రేపు జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను తహసీల్దార్ రమేశ్, ఎస్సై రామ్మోహన్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రదేశంలో భద్రత, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి వసతులపై సమీక్షించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన


