హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే నిర్వాహకులపై కేసు నమోదు: ఎస్సై

NRPT: గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు డీజే ఓనర్లు, నిర్వాహకులపై ఉట్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే, నిమజ్జనాల్లో చిన్నపిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు.