హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమస్యకు పరిష్కారం చూపాలి'

ASF: పెంచికల్‌పేట్–బెజ్జూర్‌ మార్గంలోని లోడ్పల్లి వద్ద విద్యార్థులు, ఆటో కార్మికులు రాస్తారోకో చేపట్టారు. రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్లపొదల వల్ల, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఆ పొదలను తొలగించి, ప్రయాణికులకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.