హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పగిడాల వద్ద తగ్గిన కేసీ కాలువ నీటిమట్టం

NDL: పగిడాల వద్ద కేసీ కాలువలో నీటిమట్టం ఒక్కసారిగా తగ్గింది. గత వారం నిండుగా ప్రవహించిన కాలువలో వినాయక నిమజ్జనాల అనంతరం నీరు తగ్గడంతో విగ్రహాలు బయటపడ్డాయి. సాగు కోసం నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాకాలంలో పంటలు వేసినా సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే కాలువకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.