హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు'

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలికల జనరల్ గురుకుల పాఠశాల కళాశాలలో మంగళవారం మండల స్థాయి SGF క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో MEO శంకర్, ప్రిన్సిపల్ సౌమ్య, పీడీ శోభారాణి పాల్గొన్నారు.