హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎండిపోతున్న పంటలకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి'

GNT: వర్షాలు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు.