హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చదనం కోసం మొక్కల పెంపకం

SDPT: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమాన్ని సర్పంచ్ బైర మానస ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి దాచారం స్టేజ్ వరకు రహదారి వెంట మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని సర్పంచ్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వాములై ప్రతి ఇంటి వద్ద మొక్కలు పెంచాలన్నారు.