హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డుంబ్రిగూడలో ముసురు వాతావరణం

ASR: అల్పపీడన ప్రభావంతో డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగుతోంది. ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండడంతో పలు గ్రామాల్లో రహదారులపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు చల్లటి వాతావరణంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.