హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ పై పూల వర్షం

ATP: రాప్తాడు నియోజకవర్గానికి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో ఆయన దివంగత నాయకులు పరిటాల రవి, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ పర్యటనతో స్థానిక నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.