హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డింగ్ డ్యాన్సులు.. ఆరుగురిపై కేసు!

AKP: మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో వినాయక నిమజ్జనం వేళ అశ్లీల నృత్యాలు నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఈ చర్యలకు పాల్పడిన వివేక్, విష్ణు, నాగేశ్వరరావు, భాను ప్రసాద్, అనిల్‌కుమార్‌లపై కేసు పెట్టినట్లు ఎస్ఐ ప్రసాదరావు ఇవాళ తెలిపారు. నిమజ్జనాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.