హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ విజయ దుర్గా దేవి అలయంలో నేడు రాహుకాల పూజలు

KDP: కడపలోని శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో మంగళవారం ప్రత్యేక రాహుకాల పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి, అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని అర్చకులు కోరారు.