హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెన్నూరులో యల్లమ్మ తల్లి ఆలయంలో చోరీ

KDP: చెన్నూరులోని శ్రీ యల్లమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు అమ్మవారి కిరీటం, ముక్కుపుడక, చెవి పోగులతో పాటు సుమారు అర కిలో వెండి ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఉదయం అర్చకులు ఆలయం తెరిచేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దొంగల కోసం దర్యాప్తు వేగవంతం చేశారు.