హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు మండలంగా ప్రకటించాలి'

AKP: గొలుగొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఎం సీనియర్ నాయకుడు నారాయణమూర్తి డిమాండ్ చేశారు. గొలుగొండ మండలం సుద్దలపాలెం, అడ్డంలోవ గ్రామాల్లో మంగళవారం సీపీఎం నాయకులు పర్యటించారు. వర్షాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని, అప్పులు చేసి పెట్టిన పెట్టుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు.