హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరిలో దిగి మరో వ్యక్తి గల్లంతు

ఏలూరు: కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి దిగి పాల్రాజ్ గల్లంతైన ఘటన మరువకముందే అదే ప్రాంతంలో మరో వ్యక్తి గల్లంతైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. తోటపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ శివాలయ దర్శనం కోసం వచ్చి గోదావరిలో స్నానానికి దిగినట్లు తెలుస్తోంది. రాజేశ్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గల్లంతైనట్లు తెలిపారు.