హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. వైద్యశిబిరం ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు చికిత్స చేయించుకోవాలని కోరారు. అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.