ఏలూరు: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల వినతులను స్వీకరించారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే


