హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో రేపు మెగా జాబ్‌ మేళా

PLD: వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు తెలిపారు. 35కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు విద్యార్హతలు కలిగిన 18–35 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావచ్చన్నారు. రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం ఉంటుందన్నారు.