ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను నూతన వన్ టౌన్ సీఐ కరుణాకర్ మంగళవారం కలిశారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలని సీఐకి ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అక్రమాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసిన వన్ టౌన్ సీఐ


