హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు వర్షపాత హెచ్చరిక

ASR: అనంతగిరి (M)లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని MAO రంగారావు తెలిపారు. రైతులు పొలాల్లో నీరు నిల్వకుండా డ్రైనేజీ చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీ వాయిదా వేయాలి. పంటల్లో తేమ తెగుళ్లను గమనించాలని, ఉరుములు, మెరుపుల సమయంలో పొలాలకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలన్నారు.