హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంచు దుప్పటి కప్పుకున్న కొండలు..

AKP: అల్పపీడన ప్రభావంతో రోలుగుంట మండలంలో ఈరోజు వేకువజాము నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులతో ముసురు కొనసాగుతోంది. పరిసర కొండలను దట్టమైన పొగమంచు, వర్షపు మేఘాలు కప్పేయడంతో ప్రకృతి అందాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కొండలను మంచు ముద్దాడుతున్నట్లున్న ఈ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.