హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎండాడలో వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

VSP: అల్పపీడనం ప్రభావంతో విశాఖ నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎండాడలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆరిలోవ, వెంకోజిపాలెం, హనుమంతవాక, చిన్నగదిలి, పెదగదిలి, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.