హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి అనుమానాస్పద మృతి

GNTR: తెనాలిలో యడ్ల లింగయ్య కాలనీలో తేజ(26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన తేజ తెనాలికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకుని నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. నిన్న అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. కొడుకు మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.