హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల రెన్యూవల్ గడువు పొడిగింపు

కడప: మద్యం దుకాణాల రెన్యూవల్ గడువును ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారులు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా స్పందన తక్కువగా ఉండటంతో మరో రెండు రోజులు అవకాశం కల్పించారు. కడప జిల్లాలో 141 దుకాణాలకు గాను ఇప్పటివరకు 83 మాత్రమే రెన్యూవల్ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కడపలో రెన్యూవల్స్ కాస్త వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.