హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

అన్నమయ్య: పీలేరు మండలం వేపులబయలు బస్‌స్టాప్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కలికిరి పట్టణం బీడీ కాలనీకి చెందిన యునస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ప్రమాదంలో గాయపడిన యునస్‌ను పోలీసులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శశి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.