ఏలూరు: ప.గో జిల్లా భీమవరం-ఉండి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ల నడుమ 50-55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెంది ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం


