హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడువు ముగిసిన బీరు బాటిళ్లు ప్రత్యక్షం

CTR: గడువు ముగిసిన బీరు బాటిళ్లు పుంగనూరులోని ఓ మద్యం షాపులో కనిపించాయి. నిన్న సాయంత్రం కొంతమంది బీర్లను కొనుగోలు చేశారు. ఆ బీర్లను తాగుతుండగా ఒకరికి సందేహం వచ్చి బాటిల్‌పై ముద్రించిన స్టిక్కర్‌ను గమనించారు. 'మే నెల 11వ తేదీకి' గడువు ముగిసింది. 4 నెలలు గడిచిన తర్వాత కూడా బీర్లును ఎలా విక్రయిస్తారని షాప్ నిర్వాహకుడిని బాధితులు నిలదీశారు.