కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు మంగళవారం వెలగదుర్రు వాస్తవ్యులు చేకూరి నాగ సూర్పరాజు వారి కుటుంబ సభ్యులు రూ.1,01,120 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదాన పథకానికి రూ.1.1 లక్షలు


