హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు మృతి

ప్రకాశం: ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని దుర్గాప్రసాద్ అనే బాలుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనం ఢీకొన్న సమయంలో దుర్గాప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.