హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలి'

PPM: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఎస్పీ మాధవరెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ తదితర సమస్యలు రాగా, వాటిని చట్ట పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.