హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తితో బెదిరించి దోపిడీ

ATP: గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డు పక్కనున్న కోయనగర్‌లో ఇద్దరు దోపిడీ దొంగలు సోమవారం సాయంత్రం బీభత్సం సృష్టించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మనోజ్‌కుమార్‌ ఇంటిలోకి ముసుగులతో చొరబడి వారిని గదిలో బంధించి కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రూ.60 లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.