నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ఈనెల 24న జరగాల్సిన సీఎం చంద్రబాబు పల్లె పండుగ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈనెల 29వ తేదీన నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పర్యటన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో సీఎం పర్యటన వాయిదా...!


