హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 తులాల బంగారం చోరీ

KRNL:ఆదోని పట్టణ శివారులోని మండగిరి మంజునాథ్ ఎస్టేట్‌లో సోమవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు 5 తులాల బంగారం, రూ.30 వేల నగదును అపహరించారు. బాధితుడు తిమ్మప్ప ఫిర్యాదుతో ఆదోని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.