హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు అభివృద్ధికి రూ.31 కోట్లు

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో నెల కొన్న తాగునీరు, రహదారులు, విద్యుత్తు ఇతర వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని పురపాలక కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. పట్టణంలో అన్ని వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీ, ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాటికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి శంకుస్థాపన చేస్తారని అన్నారు.