హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిజియోథెరపిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు

AKP: జిల్లా వ్యాప్తంగా సమగ్ర శిక్షా పరిధిలోని 12 భవిత కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఫిజియోథెరపిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పథక అదనపు సమన్వయకర్త కె. శ్రీరాములు తెలిపారు. బీపీటీ లేదా ఎంపీటీ అర్హతతో పాటు యూజీసీ గుర్తింపు పొందిన విద్యాసంస్థ ధ్రువపత్రం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులు ఈ నెల 24లోగా సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.